ఇరాక్‌లోని (Iraq News) బాగ్దాద్‌కు ఈశాన్యం వైపున ఉన్న గ్రామంపై ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద గ్రూపుకు చెందిన ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో 11 మంది పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
దియాలా ప్రావిన్స్‌లోని బకౌబాకు ఈశాన్య భాగంలో ఉన్న అల్-రషాద్లో షియాలు ఎక్కువగా ఉండే గ్రామంలో ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదులు.. ఇంతకుముందు ఇద్దరు గ్రామస్థులును కిడ్నాప్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం గ్రామంపై దాడికి దిగినట్లు వివరించారు. ఈ దాడిలో మిలిటెంట్లు మిషన్ గన్లను ఉపయోగించినట్లు తెలిపిన అధికారులు.. దీనిలో బాధితులు అందరూ సాధారణ పౌరులేనని స్పష్టం చేశారు.