ఇరాక్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు అత్యంత హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళన చేస్తున్నవారిపై ఇరాక్ భద్రతా దళాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఐదుగురు నిరసనకారులు కాల్పులలో మరణించగా, బాష్పవాయు గోళాలు తలకు తగిలి మరొకరు మృతి చెందారు. ఈ ఘటనలో వంద మందికి పైగా గాయపడ్డారు.
ఇరాక్‌లో ఆగని నిరసన జ్వాల - కాల్పుల్లో ఆరుగురి మృతి - Five of the protesters were killed by live ammunition, while the sixth died after being shot in the head with a tear gas canister in iraq
ఇరాక్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో మరోసారి హింస తాండవించింది. ప్రభుత్వ కార్యాలయాలు ఉండే గ్రీన్‌జోన్‌లోకి ప్రవేశించడానికి నిరసనకారులు చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఆందోళనకారులపై భద్రతా దళాలు చేసిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. వందమందికిపైగా గాయపడ్డారు.
బాగ్దాద్‌లోని వంతెనపై నుంచి నిరసనకారులు ముందుకు రాకుండా దళాలు నిలువరించాయి. టైగ్రిస్ నదిపైనున్న మూడు వంతెనలపైకి చేరుకున్న నిరసనకారులు.. ప్రభుత్వ భవనాలు ఉన్న అత్యంత భద్రత కలిగిన గ్రీన్ జోన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. బాగ్దాద్‌లోనే కాక ఇతర నగరాల్లో కూడా నిరసనలు హోరెత్తుతున్నాయి. బస్రా నగరంలో జరిగిన ఆందోళనల్లో ముగ్గురు మరణించారు. దక్షిణ ఇరాక్‌లోని పలు ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో పదిమంది మృతి తీవ్రంగా గాయలపాలయ్యారు.
దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, అవినీతి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. నామమాత్రపు సంస్కరణలు కాకుండా పూర్తి స్థాయిలో ఆర్థిక ప్రక్షాళన చేపట్టాలని, ప్రధాని అదిల్ అబ్దుల్ మహ్దీ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.