తెలంగాణ

telangana

ETV Bharat / international

బాగ్దాద్​లో అమెరికా దళాలపై రాకెట్​ దాడి - iraq rocket attack

iraq-missile-attack
ఇరాక్ రాజధాని బాగ్దాద్​పై రాకెట్​ దాడి

By

Published : Jan 4, 2020, 10:59 PM IST

Updated : Jan 5, 2020, 11:13 AM IST

00:41 January 05

అమెరికా బలగాలపై రాకెట్​ దాడి

అమెరికా బలగాలపై రాకెట్​ దాడి

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​లో మరోసారి రాకెట్ల మోత మోగింది. అమెరికా బలగాలే లక్ష్యంగా శనివారం రెండు రాకెట్​ దాడులు జరిగాయి. ఈ ఘటనతో పాటు గ్రీన్​ జోన్​ పరిధిలో మోర్టార్​ దాడులు కూడా జరగడం తీవ్ర కలకలం రేపింది. ఇరాన్​ అనుకూల వర్గమైన కటేబ్​ హిజ్​బుల్లా ఈ దాడులకు పాల్పడినట్టు సమాచారం. అమెరికా బలగాలు ఉన్న స్థావరాలకు కనీసం వెయ్యి మీటర్ల దూరం ఉండాలని ఇరాక్‌ సైన్యాన్నికటేబ్‌ హిజ్‌బుల్లా కోరిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం గమనార్హం. అయితే ఈ ఘటనలో ఎవరు మృతి చెందలేనది ఇరాక్​ భద్రతాధికారులు స్పష్టం చేశారు. 

అగ్రరాజ్య రాయబార కార్యాలయం ఉండే గ్రీన్​ జోన్​ పరిధిలో శనివారం సాయంత్రం రెండు మోర్టార్​ దాడులు జరిగాయి. అనంతరం ఉత్తర బాగ్దాద్​లో అమెరికా బలగాలు మోహరించి ఉన్న బాలాద్​ వైమానిక స్థావరంపై రెండు కాట్యుషా రాకెట్లతో విరుచుకుపడ్డారు.

అప్రమత్తమైన అధికారులు డ్రోన్ల సహాయంతో పరిసర ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

యుద్ధ మేఘాలు...

శుక్రవారం బగ్దాద్​ విమానాశ్రయంపై అమెరికా దళాలు రాకెట్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్​ టాప్ కమాండర్​ ఖాసిం సులేమానీ మృతి చెందారు. వేకువజామున జరిగిన ఈ ఘటనలో సులేమానీ, ఇరాక్​కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మరణించారు.
ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించగా.. పశ్చిమాసియాలో భారీ బలగాలను మోహరించింది అమెరికా. ఈ నేపథ్యంలో అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 

22:55 January 04

ఇరాక్ రాజధాని బాగ్దాద్​పై రాకెట్​ దాడి

ఇరాక్ రాజధాని బాగ్దాద్​లో మరోసారి క్షిపణుల దాడి జరిగింది. గ్రీన్​ జోన్​ పరిధిలో రాకెట్​ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇరాక్​​లో అమెరికా బలగాలు మోహరించిన ప్రదేశంలోనే దాడి జరిగినట్లు సమాచారం.

Last Updated : Jan 5, 2020, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details