ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గ్రూపునకు చెందిన సీనియర్ కమాండర్‌ను తమ దేశ భద్రతా బలగాలు హతమార్చాయని ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్-కాధిమి తెలిపారు. ఉత్తర ఇరాక్‌లో నిఘా విభాగం నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్‌లో డిప్యూటీ కమాండర్, ఐఎస్ చీఫ్ అబూ యాసర్ అల్-ఇస్సావి(39) మృతిచెందాడని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఐఎస్ కమాండర్‌ను హతమార్చిన ఇరాక్ - ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్-ఖాదీ
ఐఎస్ సీనియర్ కమాండర్‌ను తమ దేశ సైనికులు హతమార్చారని ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్-కాధిమి తెలిపారు. దీంతో బాగ్దాద్‌లో ఉగ్రవాదులు ఇటీవల జరిపిన వరుస ఆత్మాహుతి దాడులకు ఆ దేశం ప్రతీకారం తీర్చుకున్నట్టయింది.
ఐఎస్ కమాండర్‌ను హతమార్చిన ఇరాక్
బాగ్దాద్‌లోని రద్దీగా ఉన్న మార్కెట్ ప్రదేశాల్లో ఈ నెల 21న పేలుళ్లు జరిగాయని చెప్పారు ముస్తఫా. ఈ ఘటనలో సుమారు 32 మంది మృతిచెందారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ బాధ్యత వహించినట్టు తెలిపింది. ఫలితంగా.. ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి ఇరాక్ సైనిక బలగాలు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇస్సావి(ఐఎస్ కమాండర్) చనిపోయాడని ఉగ్రవాద నిరోధక సంస్థ తన ఫేస్బుక్లోతెలిపింది.
ఇదీ చదవండి:చైనాలో మలద్వార స్వాబ్ పరీక్షలు