ఉక్రెయిన్ విమానాన్ని పొరపాటున కూల్చివేయడంపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని, దుర్ఘటనకు కారకులైన వారిని గుర్తించి శిక్షిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీకి హామీ ఇచ్చారు.
176 మంది అమాయకులు బలి
గత బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ ఘటనలో 176 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఉక్రెయిన్ దేశస్థులతో పాటు ఇరాన్‌కు చెందిన 82 మంది, కెనడాకు చెందిన 63 మంది ప్రయాణికులున్నారు.
శత్రు భయంతో.. పొరపాటు