తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా నిఘా డ్రోన్​ను కూల్చేశాం: ఇరాన్​

అమెరికా నిఘా డ్రోన్​ను కూల్చేశామని ఇరాన్​ సైన్యం రివల్యూషనరీ గార్డ్స్​ ప్రకటించింది. అమెరికా డ్రోన్​ను కూల్చామన్న ఇరాన్​ ప్రకటనను అమెరికా ఖండించింది.

By

Published : Jun 20, 2019, 11:45 AM IST

Updated : Jun 20, 2019, 12:12 PM IST

అమెరికా నిఘా డ్రోన్​ను కూల్చేశాం: ఇరాన్​

ఇరాన్​ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్​ను కూల్చివేసినట్లు ఇరాన్​ సైన్యం 'రివల్యూషనరీ గార్డ్స్​' ప్రకటించింది.

అమెరికాకు చెందిన 'గ్లోబల్​ హవాక్'​ నిఘా డ్రోన్​ను తమ దేశ వైమానిక దళం కూల్చేసిందని పేర్కొంది ఇరాన్. ​ఈ ఘటన దక్షిణ తీర రాష్ట్రంలోని హార్మోజ్​గన్​లో జరిగిందని ఇరాన్ ప్రభుత్వ స్టేట్​ టెలివిజన్​​ తెలిపింది. డ్రోన్ ఛాయా చిత్రాలు, వీడియో వంటి ఆధారాలను బయటపెట్టలేదు.

అదేమీ లేదు..

అమెరికా నిఘా డ్రోన్​ను కూల్చామన్న ఇరాన్ ప్రకటనను యూఎస్​ సైనికదళం ఖండించింది.

అమెరికా, ఇరాన్​ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

మధ్యప్రాచ్యంలో చమురు ట్యాంకర్లపై జరిగిన దాడుల వెనుక ఇరాన్ ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అందువల్ల దాడులకు ఆ దేశమే బాధ్యత వహించాలని అంటోంది. ఈ ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది.

ఇదీ చూడండి: ఉత్తరకొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​

Last Updated : Jun 20, 2019, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details