తెలంగాణ

telangana

ETV Bharat / international

9 మంది భారతీయులను విడుదల చేసిన ఇరాన్​

ఇరాన్​ ఇటీవల అధీనంలోకి తీసుకున్న ఎంటీ రియా నౌకలోని 12 మంది భారతీయుల్లో 9 మందిని విడుదల చేసిందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

9 మంది భారతీయులను విడుదల చేసిన ఇరాన్​

By

Published : Jul 26, 2019, 7:10 AM IST

ఇరాన్ అధీనంలో ఉన్న ఎం​టీ రియా నౌకలోని 9 మంది భారతీయులను విడుదల చేసింది ఆ దేశం. ఇరాన్​ సీజ్​ చేసిన ఈ నౌకలో 12 మంది భారతీయులు ఉన్నారు.

అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలు చమురు ట్యాంకులను స్వాధీనం చేసుకుంది ఇరాన్​. అందులో ఎంటీ రియా, బ్రిటన్​కు చెందిన చమురు ట్యాంకర్​ స్టెనా ఇమ్​పెరో ఉన్నాయి. బ్రిటన్​ ట్యాంకర్​ను ఇరాన్​ రెవల్యూషనరీ గార్డ్స్​ అధికారులు సీజ్​ చేశారు. ఈ రెండు ట్యాంకుల్లోని సిబ్బందిలో మొత్తం 30 మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం 9 మందిని విడుదల చేయగా... ఇంకా 21 మంది ఇరాన్​ అధీనంలోనే ఉన్నారు.

బ్రిటన్​ ట్యాంకర్​లోని 18 మంది, ఎం​టీ రియాలోని ముగ్గురు భారతీయులను సురక్షితంగా విడిపించేందుకు భారత్​ చర్యలు చేపట్టిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయమై ఇరాన్​ అధికారులను భారత రాయబారి కార్యాలయం సంప్రదించినట్లు తెలిపింది.

బ్రిటన్​ అధీనంలో 24 మంది

స్పానిష్​ తీరంలో బ్రిటన్​ సముద్ర, జిబ్రాల్టర్​ పోలీసులు ఇరానియన్​ చమురు ట్యాంకర్​ 'గ్రేస్​-1' నౌకను అదుపులోకి తీసుకున్నారు. ఈ నౌకలో ఉన్న 24 మంది భారతీయులు బ్రిటన్​ అధీనంలో ఉన్నారు. వారిని భారత అధికారులు కలిసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత సిబ్బందిని విడిపించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: ఆపరేషన్​ విజయ్​: కార్గిల్ పరాక్రమానికి 20 ఏళ్లు

ABOUT THE AUTHOR

...view details