తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఉగ్రవాదానికి అమెరికానే నాయకత్వం వహిస్తోంది' - Mike Pampeo

ఇరాన్​ సైన్యానికి అనుబంధ సంస్థ 'ఇస్లామిక్​​ రివల్యూషనరీ గార్డ్​ కాప్స్​'ను 'విదేశీ తీవ్రవాద సంస్థ'గా అమెరికా గుర్తించడాన్ని తప్పుబట్టారు ఆ దేశాధ్యక్షుడు హసన్​ రౌహాని. ఉగ్రవాదానికి నాయకత్వం వహిస్తోంది అమెరికానే అని ఘాటుగా స్పందించారు.

ఉగ్రవాదానికి అమెరికానే నాయకత్వం వహిస్తోంది

By

Published : Apr 9, 2019, 8:56 PM IST

ఇరాన్​పై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది అమెరికా. ఇరాన్​ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఆంక్షలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అమలు చేసిన ట్రంప్ సర్కార్​.... తాజాగా ఇరాన్​ సైన్య అనుబంధ సంస్థ 'ఇస్లామిక్​​ రివల్యూషనరీ గార్డ్​ కాప్స్ (ఐఆర్​జీసీ)​'ను విదేశీ తీవ్రవాద సంస్థగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది.

అమెరికా నిర్ణయంపై ఘాటుగా స్పందించింది ఇరాన్​. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అమెరికానే అని విమర్శించారు ఇరాన్​ అధ్యక్షుడు హసన్​ రౌహాని. 1979లో 'రివల్యూషనరీ గార్డ్స్' ఏర్పడినప్పటినుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందని రౌహాని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది ఎవరు? ఐఎస్​ఐఎస్​ను ఒక ఆయుధంగా వినియోగించుకోవాలనుకుంటోంది ఎవరు? అని అమెరికాను ప్రశ్నించారు హసన్​.

"సైన్యంతో అనుబంధమున్న సంస్థలపై ఉగ్రవాద ముద్ర వేసేందుకు మీరెవరు? ప్రపంచ దేశాలపై ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వినియోగిస్తూ... తీవ్రవాదులకు మీరే నాయకత్వం వహిస్తున్నారు."
- హసన్​ రౌహాని, ఇరాన్​ అధ్యక్షుడు

'ఐఆర్​జీసీ'ని విదేశీ తీవ్రవాద సంస్థగా గుర్తించిన అమెరికా

ఇరాన్​ సైన్యానికి అనుబంధ సంస్థ 'ఇస్లామిక్​​ రివల్యూషనరీ గార్డ్​ కాప్స్​'ను 'విదేశీ తీవ్రవాద సంస్థ'గా పరిగణిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా ఇరాన్​పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో పేర్కొన్నారు.

ఇరాన్‌పై అమెరికా కఠిన ఆంక్షలు

" ఇరాన్​పై ఒత్తిడి పెంచే చర్యలను అమెరికా కొనసాగిస్తోంది. ఇస్లామిక్​​ రివల్యూషనరీ గార్డ్​ కాప్స్​ను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాం. ఈ సంస్థకు సహకారం అందించినందుకు ఐఆర్​జీసీని కూడా ఎఫ్​టీఓ గా పరిగణిస్తున్నాం. లెబనీస్​ హెచ్​బొల్లా, పాలస్తీనియన్​ ఇస్లామిక్​ జిహాద్​, హమాస్​, ఖాతిబ్​ హెజ్​బొల్లాలనూ ఈ జాబితాలో చేర్చుతున్నాం."
-మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

ఫిబ్రవరిలో రెండో విడత కఠిన ఆంక్షలు

ఇరాన్‌పై అమెరికా రెండో విడత కఠిన ఆంక్షలను ఫిబ్రవరిలోనే అమల్లోకి తీసుకొచ్చింది. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగినందుకు ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఆంక్షలు ఇరాన్‌ చమురు వ్యాపారం, షిప్పింగ్‌, బ్యాంకింగ్‌ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details