ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 5 కోట్ల 26 లక్షల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. వీరిలో దాదాపు 12.92 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోటి 45 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 3 కోట్ల 67 లక్షల మంది కరోనాను జయించారు.
- కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 1.07 కోట్ల కేసులు నమోదయ్యాయి. వారిలో 2.47 లక్షల మందికిపైగా మరణించారు.
- ఇరాన్లో కొత్తగా 11 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 26 వేలు దాటింది. వైరస్ కారణంగా మరిణించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 40,000 మంది మృతిచెందారు.
- పాకిస్థాన్‌లో మరో 1,808 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం భాధితుల సంఖ్య 3,49,992కు చేరింది. మరో 34 మంది మృతిచెందడం వల్ల...వైరస్‌కు బలైన వారి సంఖ్య 7,055కు పెరిగింది.