ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ దళంలో కీలకమైన కుర్ద్ ఫోర్స్ అధిపతిగా డిప్యూటీ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ నియామకమయ్యారు. బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా జరిపిన వైమానిక దాడిలో కమాండర్ ఖాసీం సులేమానీ మరణించారు. ఈ క్రమంలో ఖానీకి బాధ్యతలు అప్పజెప్పినట్లు ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ వెల్లడించారు.
"కుర్ద్ ఫోర్స్‌లోని ప్రతి సైనికుడు అన్ని విధాల ఇస్మాయిల్ ఖానీకి సహకరించాలి. అలాగే కమాండర్ బాధ్యతలు చేపట్టిన ఖానీకి శుభాకాంక్షలు."