తెలంగాణ

telangana

ETV Bharat / international

డ్రోన్​ను కూల్చేశాం..ఇదిగో సాక్ష్యం: ఇరాన్

అమెరికా నిఘా డ్రోన్​ తమ గగనతలంలోకి అక్రమంగా చొరబడినందువల్లే దానిని కూల్చేశామని ఇరాన్​ మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయమై ఐక్యరాజ్యసమితిలోనూ ఫిర్యాదు చేస్తామని తెలిపింది.

By

Published : Jun 21, 2019, 10:44 AM IST

Updated : Jun 21, 2019, 2:25 PM IST

డ్రోన్​ను కూల్చేశాం..ఇదిగో సాక్ష్యం: ఇరాన్

డ్రోన్​ను కూల్చేశాం..ఇదిగో సాక్ష్యం: ఇరాన్

ఇరాన్​ గగనతలంలోకి అక్రమంగా చొరబడిన అమెరికా నిఘా డ్రోన్​ను కూల్చివేశామని ఇరాన్​ విదేశాంగ మంత్రి మొహమ్మద్​ జావేద్​ జారిఫ్​ గురువారం ప్రకటించారు.

అమెరికా నిఘా డ్రోన్​ను బుధవారం 4.05 గంటలకు కోహ్-​ఇ-ముబారక్​ సమీపంలో కూల్చివేశామని మొహమ్మద్ తెలిపారు. దీని శకలాలను తమ ప్రాదేశిక జలాల్లోనే స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. ఇందుకు సాక్ష్యంగా ఇరాన్ సైన్యం ఓ వీడియోను విడుదల చేసింది.

అమెరికా అక్రమంగా తమ భూభాగంలోకి నిఘా డ్రోన్​ను పంపిందని ఇరాన్ ఆరోపించింది. ఈ విషయంపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు ఆ దేశ విదేశాంగ మంత్రి.

అమెరికా ఖండన

అమెరికా మాత్రం ఇరాన్ వాదనలను తప్పుబడుతోంది. అంతర్జాతీయ గగనతలంలో ఉన్న తమ నిఘా డ్రోన్​ను ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఇరాన్ సైన్యం కూల్చివేసిందని ప్రత్యారోపణలు చేసింది. ఇందుకు సాక్ష్యంగా అమెరికా రక్షణ కేంద్రం పెంటగాన్ ఓ గ్రాఫిక్ మ్యాప్​ను విడుదల చేసింది.

ప్రపంచంలో 35 శాతం ముడిచమురు రవాణా అయ్యే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి వద్ద అమెరికా నిఘా డ్రోన్ ఉన్నట్లు ఆ మ్యాప్ సూచిస్తోంది.

ఇదీ నేపథ్యం

మధ్యప్రాచ్యంలో రెండు చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి. వీటిని ఇరాన్​ చేయించిందని ఆమెరికా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ కారణంగా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: 18 వేల అడుగుల ఎత్తులో జవాన్ల యోగా

Last Updated : Jun 21, 2019, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details