తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇంకా లభించని ఇండోనేషియా విమానం ఆచూకీ - ఇంకా లభించని ఇండోనేషియా విమానం ఆచూకీ

ఇండోనేషియాలో కనిపించకుండా పోయిన విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో గాలింపు చేపట్టేందుకు నాలుగు యుద్ధనౌకలను రంగంలోకి దింపారు అధికారులు.

Indonesian plane not found yet
ఇంకా లభించని ఇండోనేషియా విమానం ఆచూకీ

By

Published : Jan 10, 2021, 6:10 AM IST

Updated : Jan 10, 2021, 7:11 AM IST

ఇండోనేషియాలో 62 మందితో వెళుతూ శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. విమాన జాడ కనుగొనేందుకు జాతీయ విపత్తు స్పందన దళాలు, సైనిక బలగాలు రంగంలోకి దిగాయి.

గాలింపు చర్యల కోసం సిద్ధమవుతున్న సిబ్బంది

సముద్రంలో విమాన శకలాలను మత్స్యకారులు గుర్తించినట్లు తెలిసిన క్రమంలో.. నాలుగు యుద్ధనౌకల సాయంతో గాలింపు చేపట్టారు.

తమ వారి కోసం పడిగాపులు..

తమ వారి రాక కోసం..
తమ వారి కోసం ఇలా..
తమ వారి ఆచూకీ కోసం పడిగాపులు
చరవాణి ద్వారా సమాచారం కనుక్కుంటూ..

విమానం అదృశ్యం వార్త తెలుసుకున్న ప్రయాణికుల బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో సుకర్నో హత్త, సుపాడియో అంతర్జాతీయ విమానాశ్రయాల వద్దకు చేరుకున్నారు. తమవారు క్షేమంగానే ఉన్నారనే సమాచారం కోసం పడిగాపులుకాస్తున్నారు. విమానం కనిపించకుండా పోయి గంటలు గడుస్తున్న నేపథ్యంలో కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. వారి ఆర్తనాదాలతో విమానాశ్రయాల వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ జరిగింది..

మొత్తం 62మంది ప్రయాణికులతో బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 1.56 నిమిషాలకు జకార్తా నుంచి బయలుదేరింది. 90 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు ఇండోనేసియా రవాణా శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.ఇండోనేసియా రాజధాని నుంచి పోంటియానక్​కు బయలుదేరిన శ్రీవిజయ బోయింగ్ విమానం.. జకార్తాలోని థౌజెండ్ ద్వీపాల ప్రాంతంలో కూలిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి. జాలర్లు ఈ విమాన శకలాలను గుర్తించినట్లు స్థానిక మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో విమానాశ్రయంలో ప్రయాణీకుల బంధువుల రోదనలు మిన్నంటాయి.

విమానశ్రయంలో సహాయక కేంద్రం
ఇదీ చూడండి:ఇండోనేసియాలో అదృశ్యమైన విమానం కూలినట్టేనా?
Last Updated : Jan 10, 2021, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details