తెలంగాణ

telangana

ETV Bharat / international

కుప్పకూలిన సైనిక హెలికాప్టర్.. నలుగురు జవాన్లు మృతి - latest accident news

ఇండోనేషియాలో సైనిక హెలికాప్టర్​ కూలిన ఘటనలో నలుగురు సైనికులు మరణించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అధికారులు.

Indonesian army helicopter crashes, killing 4
కూలిన ఆర్మీ హెలికాఫ్టర్​.. నలుగురు మృతి

By

Published : Jun 6, 2020, 10:27 PM IST

ఇండోనేషియాలో సైనిక హెలికాప్టర్​ కూలిపోయింది. ప్రమాద సమయంలో విహాంగంలో పైలట్​ సహా తొమ్మిది మంది సైనికులు ఉన్నారు. అందులో నలుగురు జవాన్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

రష్యాకు చెందిన ఎంఐ 17 హెలికాఫ్టర్​ తొమ్మిది మంది సైనికులను.. శిక్షణలో భాగంగా తీసుకెళ్తుండగా జావా ప్రధాన ద్వీపంలో శనివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగి నేలకూలినట్లు అనుమానిస్తున్నారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details