ఇండోనేసియాలో ఇల్లు, భవనాల శిథిలాల కింద చిక్కుకున్న మరిన్ని మృత దేహాలను సహాయ బృందాలు ఆదివారం వెలికితీశాయి. దాంతో భూకంపంలో మరణించిన వారి సంఖ్య 73కు చేరింది. కాగా 800మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
ఒక్క మముజు ప్రాంతంలోనే భూకంప ధాటికి 64 మంది మృతిచెందారు. పక్క జిల్లా మజేనాలో 9 మంది చనిపోయారు. 27,850 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. ఆహార పదార్థాలు అందజేసేందుకు దెబ్బతిన్న రోడ్లను సహాయక బృందాలు మరమ్మతు చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. విద్యుత్, సమాచార సరఫరాను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.