ఇండోనేసియాలో భారీ వర్షాలు, వరద బీభత్సం కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో సోమవారం ఉదయం నాటికి 55 మంది మరణించారు. 40 మందికి పైగా గల్లంతయ్యారు. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు విపత్తు నిర్వహణ అధికారులు. తూర్పు నుసా తెగ్గరా రాష్ట్రంలోని లమేనెలే గ్రామంలో 38 మృతదేహాలను వెలికితీసినట్లు స్థానిక విపత్తు నిర్వహణ అధికారి లెన్నీ ఓలా తెలిపారు.
''విద్యుత్ అంతరాయం, రోడ్డు మార్గాల్లో చెత్త పేరుకుపోవటం.. తదితర కారణాల వల్ల సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. లమేనెలే గ్రామంలో దాదాపు 40 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం.''