తూర్పు తైమూర్, ఇండోనేసియా దీవుల్లో 'సెరోజా' తుపాను కారణంగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మరణించినవారి సంఖ్య 140కి చేరింది. అనేక మంది గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు.
పేరుకుపోయిన మట్టిన తొలగిస్తున్న సిబ్బంది అర్ధరాత్రి విపత్తు
తూర్పు నుసా తెంగ్గారా ప్రావిన్స్‌లోని అడొనరా ద్వీపంలో ఆదివారం అర్ధరాత్రి లామెనెలా గ్రామంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 67 మంది మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మరో ఆరుగురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
తూర్పు తైమూర్‌లో విపత్తు కారణంగా 27 మంది దుర్మరణం పాలయ్యారని తెలిపారు.
లంబాటా ద్వీపంలో అగ్నిపర్వతం నుంచి సమీప గ్రామాలకు టన్నులకొద్దీ లావా ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా ఇది ఘనీభవిస్తుండగా దీని కింద చిక్కుకొని కనీసం 32 మంది మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరో 35 మంది ఆచూకీ గల్లంతయ్యిందని అంచనా వేస్తున్నారు. వరద ఉద్ధృతికి ఈ ప్రాంతంలో ఐదు వంతెనలు, నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. వేల మంది స్థానికులు ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
మృతదేహాలను వెలికితీస్తున్న సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు అధికారులు.
ఇదీ చదవండి:'ఇరాన్ చర్చల్లో ఫలితం ఇప్పట్లో కష్టమే'