Indonesia Earthquake: ఇండోనేసియాలోని జావా సహా పలు ప్రాంతాల్లో భూమి శుక్రవారం భారీగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హిందూ మహాసముద్రంలో భూకంపం ఏర్పడినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. బాంటెన్ రాష్ట్రంలోని లాంబౌన్ ప్రాంతానికి 88 కిలోమీటర్ల దూరంలో, 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు తెలిపింది.
ఇండోనేసియాలో భారీ భూకంపం- రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రత - ఇండోనేసియాలో భూకంపం
Indonesia Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. బాంటెన్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో భూమి కంపించినట్లు యూస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
భూకంపం
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సునామీ ప్రమాదం కూడా లేదని అధికారులు వెల్లడించారు. కానీ భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. భూకంపం కారణంగా పశ్చిమ జావాలోని ఇళ్లు దెబ్బతిన్నాయి.
ఇదీ చూడండి :Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి?