తజకిస్థాన్ వేదికగా త్వరలో భారత్-పాకిస్థాన్ విదేశాంగమంత్రులు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'హార్ట్ ఆఫ్ ఏషియా' సదస్సు కోసం పాక్ విదేశాంగమంత్రి షా మహమ్మద్ ఖురేషి త్వరలో తజకిస్థాన్ వెళ్లనున్నారు. ఈ సదస్సుకు భారత విదేశాంగమంత్రి జై శంకర్ హాజరయ్యే అవకాశం ఉండటం వల్ల ఇరువురి మధ్య సమావేశం జరుగుతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి.
తజకిస్థాన్ రాజధాని దుషంబే వేదికగా.. ఈ నెల 30న ఈ "9వ మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ఏషియా- ఇస్తాంబుల్ ప్రాసెస్" సదస్సు జరగనుంది. అయితే దీనికి జై శంకర్ హాజరువుతారా? లేదా? విదేశాంగమంత్రుల మధ్య భేటీ ఉంటుందా? అన్న అంశాలపై స్పష్టత లేదు.
కానీ పాకిస్థాన్‌కు చెందిన ఓ వార్తా సంస్థ మాత్రం.. ఈ సదస్సుకు ఇరువురు పాల్గొంటారని పేర్కొంది. ఫలితంగా వీరి భేటీ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భేటీ సాధ్యమే!