భారత్‌లోని ఓ ప్రముఖ వ్యాపార సంస్థకు చెందిన నౌక.. ఐదు నెలలుగా చైనాలో చిక్కుకుపోయింది. ముంబయి గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ లిమిటెడ్‌కు చెందిన 'జగ్ ఆనంద్' నౌక.. గత జూన్ నుంచి ఉత్తర జింగ్టంక్ ఓడరేవులో ఉండిపోయింది. తాము తీసుకొచ్చిన సరకును చైనా ఓడరేవు అధికారులు దిగుమతి చేస్కోనందునే ఈ పరిస్థితి తలెత్తిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్వస్థలాలకు చేరేందుకు సాయం కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.
మందుల కొరత..
ఆ నౌకలో 23మంది భారతీయ సిబ్బంది చిక్కుకోగా.. ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా ఉన్నట్టు సమాచారం. వారిలో ఎక్కువ మంది అనారోగ్య సమస్యల(రక్తపోటు, మధుమేహం)తో సతమతమవుతున్నారు. అయితే వారికి మందులు కూడా అందుబాటులో లేవని.. ఓ సిబ్బంది తమ కష్టాల గురించి ఫోన్ ద్వారా మీడియా అధికారులతో చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు.
"మేము సుమారు 1.7 లక్షల టన్నుల ఆస్ట్రేలియన్ బొగ్గును లోడ్ చేసుకుని జనవరిలో ఓడ ఎక్కాం. మే నెలలో ఆస్ట్రేలియా నుంచి బయల్దేరి జూన్ 13నాటికి చైనాలోని జింగ్టంక్ నౌకాశ్రయానికి చేరుకున్నాం. అప్పటి నుంచి ఇక్కడే ఇరుక్కుపోయాం. ఎన్నో నెలలుగా మా కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాం. చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వైరస్ వ్యాప్తి కూడా ఆందోళన కలిగిస్తోంది. దయచేసి మా విజ్ఞప్తిని స్వీకరించి.. సరకును దించుకొని, మేము ఇంటికి వెళ్లేందుకు అనుమతించండి."
- సిబ్బంది, జగ్ ఆనంద్ ఓడ.
ప్రత్యామ్నాయ మార్గాలపై..