భారత్‌పై ఎప్పుడూ అక్కసువెళ్లగక్కే పాకిస్థాన్ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. తన శాశ్వత మిత్రదేశమైన చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. సరిహద్దును విస్తరించుకోవడానికి భారత్ పాటిస్తున్న విధానాల వల్ల పొరుగు దేశాలకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపిస్తూ వరుస ట్వీట్లు చేశారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
"సరిహద్దును విస్తరించడానికి భారత్ చేపట్టే అహంకారపూరితమైన విధానాలు పొరుగు దేశాలకు ముప్పు తెస్తున్నాయి. పౌరసవరణ చట్టం ద్వారా బంగ్లాదేశ్‌తో, నేపాల్- చైనాలతో సరిహద్దు వివాదం, అసాంఘిక కార్యకలాపాల ఆరోపణలతో పాక్‌తో బెదిరింపులకు పాల్పడుతోంది భారత్."