తెలంగాణ

telangana

ETV Bharat / international

'బద్ధకం'లో భారతీయులు నెంబర్-1​... నిద్రలేమిలో సెకెండ్ - నిద్రలేమి, తక్కువ చురుకుదనం గలవారు భారత్​లోనే

భారతీయుల్లో చురుకుదనం తక్కువని ఫిట్​నెస్​ సంస్థ ఫిట్​బిట్ నివేదికలో వెల్లడైంది. అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్ సహా 18 దేశాలపై సర్వే నిర్వహించింది.

నిద్రలేమి, తక్కువ చురుకుదనం గలవారు భారత్​లోనే

By

Published : Oct 30, 2019, 1:01 PM IST

ప్రజల్లో చురుకుదనం అత్యంత తక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. నిద్రలేమి ఎక్కువగా ఉన్న దేశాల్లో రెండో స్థానంలో ఉంది. ప్రముఖ పిట్​నెస్ సంస్థ 'ఫిట్​బిట్'​ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారత్​, అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్ సహా 18 దేశాల ప్రజలపై సర్వే చేసి ఈ నివేదికను రూపొందించింది ఫిట్​బిట్.

భారతీయులు సగటున రోజుకు 6,533 అడుగులు మాత్రమే నడుస్తున్నారు. ఇతర దేశాలతో పోల్చితే ఈ సగటు అత్యల్పం. చురుకైన దేశాల జాబితాలో హాంగ్​కాంగ్ మొదటి స్థానంలో ఉంది. ఆ దేశస్థులు రోజుకు సగటున 10,133 అడుగులు నడుస్తూ ఆరోగ్యంగా ఉన్నారు.

నిద్రలేమిలో రెండో స్థానం

నిద్రలేమితో బాధపడుతున్న దేశాల్లో జపాన్ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో నిలిచింది భారత్. భారతీయులు రోజుకు సగటున 7 గంటల 1నిమిషం మాత్రమే నిద్రపోతున్నట్లు ఫిట్​బిట్ నివేదిక పేర్కొంది. ఈ జాబితా ఐర్లాండ్ చివరి స్థానంలో నిలిచింది. వాళ్లు రోజుకు సగటున 7 గంటల 57 నిమిషాలు నిద్రపోతున్నారు.

75-90 ఏళ్ల మధ్య వయస్సు గల భారతీయులు రోజుకు 6 గంటల 35 నిమిషాలు మాత్రమే నిద్రిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 18-25 మధ్య వయస్సు గల యువత అర్ధరాత్రి దాటితే గానీ నిద్రలోకి జారుకోవడంలేదని ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఐనా వీరు ఏడు గంటలకు పైగా నిద్రపోవడం గమనార్హం.

ఇదీ చూడండి : అమెరికా సైన్యం చేతిలో బగ్దాదీ వారసుడు హతం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details