రక్షణ రంగ ఒప్పందంలో భాగంగా అరేబియా సముద్రంలో అమెరికా నావికా దళానికి చెందిన ట్యాంకర్ యూకోన్ నుంచి భారత యుద్ధనౌక ఇంధనాన్ని నింపుకొంది. లాజిస్టిక్స్ బదిలీపై కుదిరిన అవగాహన ఒప్పందం కింద ఐఎన్ఎస్ తల్వార్ యుద్ధనౌక... యూకోన్ ట్యాంకర్ నుంచి ఇంధనం నింపుకొన్నట్లు భారత నేవీ వెల్లడించింది. సైనిక విధుల కోసం ఉత్తర అరేబియా సముద్రంలో... ఐఎన్ఎస్ తల్వార్‌ను మోహరించినట్లు తెలిపింది.
భారత యుద్ధనౌకకు ఇంధనం నింపిన అమెరికా నేవీ - Logistics Memorandum of Understanding on Transfer
అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ తల్వార్ యుద్ధనౌక.. అమెరికా నేవీకి చెందిన యూకోన్ ట్యాంకర్ నుంచి ఇంధనం నింపుకొన్నట్లు భారత నావికా దళం వెల్లడించింది. రక్షణ రంగంలో సహకారం పెంపొందించుకునేలా 2016లో భారత్-అమెరికా మధ్య లాజిస్టిక్స్ బదిలీపై కుదిరిన అవగాహన ఒప్పందం(ఎల్‌ఈఎంఓఏ) కింద ఇంధనం నింపుకొన్నట్లు తెలుస్తోంది.

భారత యుద్ధనౌకకు ఇంధనం నింపిన అమెరికా నేవీ
రక్షణ రంగంలో సహకారం పెంపొందించుకునేలా 2016లో భారత్-అమెరికా మధ్య లాజిస్టిక్స్ బదిలీపై అవగాహన ఒప్పందం(ఎల్‌ఈఎంఓఏ) కుదిరింది. భారత్‌కు.. ఫ్రాన్స్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియాలతోనూ ఈ తరహా ఒప్పందాలు ఉన్నాయి.
ఇదీ చూడండి:శుక్రుడి మేఘాల్లో సూక్ష్మజీవులు?
Last Updated : Sep 15, 2020, 8:50 AM IST