భారత్తో సరిహద్దు వివాదానికి(India China Border Dispute) సంబంధించి చైనా తీవ్ర ఆరోపణలు చేసింది. వాస్తవాధీన రేఖను(Line Of Actual Control) దాటి తమ భూభాగాన్ని భారత్ ఆక్రమిస్తోందని ఆరోపించింది. అదే.. ఇరు దేశాల మధ్య తలెత్తిన సరిహద్దు ఉద్రిక్తతలకు(India China Border Dispute) ప్రధానం కారణం అని వ్యాఖ్యానించింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ అత్యంత అధునాతన ఆయుధాలను భారత్ మోహరిస్తోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"భారత్ చాలాకాలంగా 'ఫార్వర్డ్ పాలసీ'ని అనుసరిస్తోంది. చైనా-భారత్ సరిహద్దు ఉద్రిక్తతలకు ప్రధాన కారణం.. వాస్తవాధీన రేఖను ఆ దేశం అక్రమంగా దాటి రావడమే. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఆయుధాలు వినియోగించడానికి చైనా వ్యతిరేకం. మేం ఎల్లప్పుడూ జాతీయ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడేందుకే ప్రయత్నిస్తాం. భారత్-చైనా సరిహద్దులో శాంతి, స్థిరత్వ స్థాపనకు కట్టుబడి ఉన్నాం."
-హువా చున్యింగ్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.
అప్పటివరకు తప్పవు..
మరోవైపు.. భారత్ -చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై(India China Border Dispute) భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె(Army Chief Of India).. కీలక వాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య కచ్చితమైన సరిహద్దు ఒప్పందం కుదిరే వరకు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు.