న్యూజిలాండ్‌లో గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డా. గౌరవ్ శర్మ.. తాజాగా ఆ దేశ పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. 33ఏళ్ల గౌరవ్.. సంస్కృతంలో ప్రమాణం చేయడం విశేషం.
తొలుత న్యూజిలాండ్ అధికారిక భాష మోరీలో ప్రమాణస్వీకారం చేసిన గౌరవ్.. ఆ తర్వాత సంస్కృతంలోనూ ప్రమాణం చేశారు. భారత్- న్యూజిలాండ్ సంప్రదాయానికి ఆయన ఇచ్చే విలువకు ఇది అద్దంపడుతోందని ఆ దేశంలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది.
ఈ నేపథ్యంలో హిందీలో ఎందుకు ప్రమాణస్వీకారం చేయలేదని ఓ నెటిజెన్ గౌరవ్‌ను ప్రశ్నించారు. నిజానికి తాను హిందీలోనే ప్రమాణస్వీకారం చేద్దామనుకున్నట్టు వెల్లడించారు ఆయన. కానీ సంస్కృతం అయితే అన్ని భాషలకు నివాళినిస్తున్నట్టు ఉంటుందని అభిప్రాయపడ్డారు.