జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సరికాదంటూ నిరసన వ్యక్తం చేస్తూ భారత దౌత్యాధికారిని వెనక్కి పంపించేందుకు నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్ ఆ దిశగా మరో అడుగు వేసింది. వినోద రంగంలో ఇరు దేశాల సంయుక్త కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ సమాచార ప్రసారాల శాఖ 'సే నో టూ ఇండియా' అనే భారత వ్యతిరేక నినాదాన్ని విడుదల చేసింది.
"భారత్కు చెందిన సమాచారమేదైనా ప్రసారం చేయకూడదని, ఆ దేశానికి చెందిన డీటీహెచ్ వస్తువులను అమ్మరాదని నిర్ణయించాం. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(పెర్మా) ప్రకటన జారీ చేసింది."
-ఫిర్దౌస్ ఆషీక్ ఆవాన్, పాక్ ప్రధాని సమాచార సహాయకురాలు