యూఏఈలో మరో ప్రవాస భారతీయుడిని అదృష్టం తలుపు తట్టింది. దుబాయిలో నిర్వహించిన లక్కీడ్రాలో కర్ణాటక శివమొగ్గకు చెందిన శివమూర్తి క్రిష్ణప్ప.. 202511 టికెట్‌తో రూ.24కోట్లు గెలుచుకున్నాడు.
క్రిష్ణప్ప 15ఏళ్లుగా దుబాయ్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి 10, 4 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు.గత ఏడాది నుంచి ప్రతినెలా లాటరీ టికెట్లు కొంటున్నాడు.అలాగే.. ఫిబ్రవరి17న లాటరీ టికెట్ కొన్నాడు క్రిష్ణప్ప. లక్కీడ్రాలో అతను కొనుగోలు చేసిన టికెట్‌కే బహుమతి లభించింది.
"లక్కీడ్రా ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాను. డ్రాలో నేను రూ.24 కోట్లు గెలుచుకున్నానంటే ఇంకా నమ్మలేక పోతున్నా. ఈ డబ్బుతో సొంత ఊరిలో పెద్ద ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నాను. కొంత డబ్బును నా పిల్లల పేరున బ్యాంకులో డిపాజిట్ చేస్తాను."