ఎగురుతున్న విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావటం వల్ల అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అనతరం అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
దిల్లీకి చెందిన గోఎయిర్ 'జీ8-6658ఏ' విమానం 179 మంది ప్రయాణికులతో రియాద్ నుంచి దిల్లీకి మంగళవారం బయలుదేరింది. ఈ క్రమంలో పాకిస్థాన్ గగనతలంలో ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటు రాగా అవసరమైన వైద్య సాయం అందించారు. అతడు స్పృహ కోల్పోవడం వల్ల కరాచీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. సదరు ప్రయాణికుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.