తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆసియా దేశాల్లో కరోనా విజృంభణ- రష్యాలో తీవ్రం - కరోనా న్యూస్​

ప్రపంచదేశాలపై కరోనా పంజా విసురుతూనే ఉంది. రష్యాలో ఒక్కరోజులోనే 7 వేల 600కుపైగా కేసులు నమోదయ్యాయి. మెక్సికోలో కొత్తగా 5 వేలు, పాకిస్థాన్​లో 4 వేలమందికి వైరస్​ సోకింది. సౌదీ అరేబియా, బంగ్లాదేశ్​ సహా ఇతర ఆసియా దేశాల్లో కొవిడ్​ వేగంగా విజృంభిస్తోంది.

Indian man among two new coronavirus cases in New Zealand
ఆసియా దేశాల్లో విజృంభిస్తోన్న కరోనా.. రష్యాలో తీవ్రం

By

Published : Jun 22, 2020, 7:40 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రతాపం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 90 లక్షల మందికి పైగా కరోనా సోకింది. మరణాలు 4 లక్షల 71 వేలు దాటాయి. 48 లక్షల మందికిపైగా కోలుకున్నారు.

కరోనా వివరాలు

రష్యాలో కొత్తగా 7,600 కేసులు..

కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ రష్యాలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా మరో 7,600 మంది వైరస్​ బారినపడ్డారు. 95 మంది వైరస్ సోకి మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 8,206కు చేరింది. ఇప్పటివరకు 5,92,280 మందికి కరోనా​ సోకినట్లు అధికారులు తెలిపారు.

పాక్​లో తీవ్రం..

పాకిస్థాన్​లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 4,471 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 1,81,088కి చేరింది. మరో 89 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 3,590 మంది వైరస్​కు బలయ్యారు.

10 వేలకు చేరువలో..

నేపాల్​ను కరోనా వైరస్ వణికిస్తోంది. గడచిన 24 గంటల్లో 535 మందికి వైరస్​ సోకినట్లు ఆ దేశ అధికార యంత్రాంగం ప్రకటించింది. దీంతో వైరస్​ కేసులు 10 వేలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 9,561 మంది వైరస్ బారినపడ్డారు. దేశంలో కరోనాతో 23 మంది మరణించారు.

న్యూజిలాండ్​లో మరో ఇద్దరికి..

న్యూజిలాండ్​లో తాజాగా రెండు కరోనా కేసులు బయటపడినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు భారత సంతతి వ్యక్తిగా గుర్తించారు. దేశంలో కరోనా కేసులు లేవని ఆ దేశ ప్రధాని ప్రకటించిన తర్వాత మొత్తం తొమ్మిది మంది వైరస్​ బారినపడ్డారు.

సింగపూర్​లో 26 మంది..

సింగపూర్​లో కొత్తగా 218 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 217 మంది విదేశీ వలస కార్మికులని ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:చైనా సైన్యంపై గెలుపు సులువే- ఇవే కారణాలు...

ABOUT THE AUTHOR

...view details