తెలంగాణ

telangana

ETV Bharat / international

56 మంది భారత జాలర్ల విడుదలపై శ్రీలంక కోర్టు కీలక తీర్పు - శ్రీలంక కోర్టు ఆదేశం

Indian Fishermen Sri Lanka: 56 మంది భారత జాలర్ల విడుదలపై శ్రీలంక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. శ్రీలంక నావికాదళం నిర్బంధించిన భారత జాలర్లను విడిచిపెట్టాలని ఆదేశించింది.

srilanka
శ్రీలంక

By

Published : Jan 26, 2022, 5:17 AM IST

Indian Fishermen Sri Lanka: తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టారన్న ఆరోపణలపై శ్రీలంక నావికాదళం నిర్బంధించిన 56 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని అక్కడి కోర్టు మంగళవారం అధికారులను ఆదేశించింది. ఈ తీర్పుతో శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న భారతీయ మత్స్యకారులందరూ విడుదల కానున్నారు. గతేడాది డిసెంబరులో మన్నార్‌కు దక్షిణాన సముద్రంలో శ్రీలంక నావికాదళం ఈ జాలర్లను పట్టుకుంది. శ్రీలంకతో ఆర్థిక చర్చలు జరుగుతోన్న ప్రస్తుత తరుణంలో.. మానవతా దృక్పథంలో వారిని విడుదల చేయాలంటూ భారత్‌ చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో మత్స్యకారుల విడుదలకు సంబంధించి తాజా ఆదేశాలు వచ్చాయి.

కోర్టు ఆదేశాలు సంతోషకరమని కొలంబోలోని భారత హైకమిషన్ ట్వీట్‌ చేసింది. శ్రీలంకలోని భారత హైకమిషనర్‌ గోపాల్‌ బాగ్లే, ఇతర అధికారుల కృషిని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అభినందించారు. మత్స్యకారుల విడుదలను శ్రీలంక, భారత దౌత్యవర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం శ్రీలంక కస్టడీలో భారతీయ జాలరులెవరూ లేరని నిర్ధరించాయి. మరోవైపు భారత మత్స్యకారుల నుంచి స్వాధీనం చేసుకున్న పడవలను వేలం వేయాలన్న శ్రీలంక నిర్ణయంపై స్పందించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేడు కేంద్రాన్ని కోరారు. 2018 నుంచి శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకున్న 75 బోట్లను త్వరగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు.

ABOUT THE AUTHOR

...view details