తెలంగాణ

telangana

ETV Bharat / international

దుబాయ్​లో భారతీయుడిని వరించిన అదృష్టం - అదృష్ట దేవత

దుబాయ్​లో నివసించే ఓ ప్రవాస భారతీయుడికి అదృష్టం కలిసొచ్చింది. ఓ లాటరీలో విజేతగా నిలిచి 3 మిలియన్​ డాలర్లు గెలుపొందాడు. అసలే ఆర్థిక కష్టాల్లో తనకు ఈ లాటరీ గెలవడం పెద్ద ఆశీర్వాదమని అతను అనందంలో మునిగి తేలుతున్నాడు.

Indian expat wins over USD 3 million in raffle draw in UAE
ప్రవాస భారతీయడి తలుపు తట్టిన అదృష్ట దేవత!

By

Published : Dec 5, 2020, 5:22 AM IST

యూఏఈలోని ఓ ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. అబుదాబిలో గురువారం నిర్వహించిన ఓ లాటరీ డ్రాలో జార్జ్​ జాకొబ్(51) అనే వైద్య పరికరాల అమ్మకందారుడు విజేతగా నిలిచాడు. ప్రైజ్​మనీగా 3 మిలియన్​ డాలర్లు(రూ.22.13 కోట్లు) అందుకోనున్నాడు.

భారత్​కు చెందిన జాకొబ్​.. తన భార్య, ఇద్దరు పిల్లలతో దుబాయ్​లో నివసిస్తున్నాడు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న తనకు ఈ లక్కీ డ్రా రావడాన్ని పెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు అతడు చెప్పాడు. 'ది డ్రీమ్​ 12 మిలియన్​ సిరీస్​ 222' పేరుతో నిర్వహించిన ఈ లాటరీ టికెట్టును నవంబర్​ 30న కొనుగోలు చేశాడు​.

ఇదీ చూడండి:ఆ విషయంలో రష్యా, అమెరికాల సరసన చైనా!

ABOUT THE AUTHOR

...view details