తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​: చైనాలో భారత గణతంత్ర వేడుకలు రద్దు - Indian embassy in Beijing Cancels 2020 Republic day celebrations

కరోనా.. ప్రస్తుతం చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న భయంకరమైన వైరస్​. పాము ద్వారా ఈ వైరస్​ వ్యాపించి ఉంటుందని అనుమానిస్తున్నారు. తాజాగా ఈ వైరస్​ కారణంగా చైనాలోని భారతీయ రాయబార కార్యాలయం గణతంత్ర వేడుకలను రద్దుచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా దెబ్బకు చైనాలో భారత గణతంత్ర వేడుకలు రద్దు
Indian embassy in Beijing cancels Republic Day ceremony due to coronavirus outbreak in China

By

Published : Jan 24, 2020, 12:37 PM IST

Updated : Feb 18, 2020, 5:34 AM IST

కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో చైనాలోని భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26న జరగాల్సిన గణతంత్ర దినోత్సవాల కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు.. బీజింగ్‌లోని రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో ఎక్కువ మంది గుమికూడరాదంటూ చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో గణతంత్ర వేడుకలకు దూరంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం నిర్ణయించింది. చైనా నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు సూచనలు జారీ చేసింది.

ఇదీ చదవండి:రాజకీయాలకు అతీతం.. దేశ రక్షణే సర్వస్వం

Last Updated : Feb 18, 2020, 5:34 AM IST

ABOUT THE AUTHOR

...view details