ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత్ గట్టిగా స్పందించింది. ఇమ్రాన్ ప్రకటనలకు ప్రతిస్పందన ఇచ్చేందుకు 'రైట్ టూ రిప్లై' అవకాశాన్ని ఇవ్వాలని ఐరాసను కోరింది.
ఇమ్రాన్ ఖాన్ ముందే రికార్డ్ చేసిన ప్రకటన చేస్తున్న సమయంలో భారత ప్రతినిధి మిజిటో వినిటో సమావేశ హాల్ నుంచి వాకౌట్ చేసి.. ఇండియా వైఖరిని స్పష్టం చేశారు.
"భారత్‌లో జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత అంతర్భాగం. విడదీయలేని అంగం. జమ్ముకశ్మీర్‌లో తీసుకొచ్చిన చట్టాలు, నిబంధనలు పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారం. కశ్మీర్‌కు సంబంధించి ఏదైనా వివాదం ఉందంటే.. అది పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ గురించే. కశ్మీర్లో పాక్ అక్రమ ఆక్రమించుకున్న అన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలి" అని భారత్ ఘాటుగా బదులిచ్చింది.
ఆర్టికల్ 370 రద్దుపై ఇమ్రాన్..
అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ తన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు.