తెలంగాణ

telangana

ETV Bharat / international

'బాలాకోట్​'పై రావత్​ వ్యాఖ్యలు నిరాధారం: పాక్​

బాలాకోట్​లో మళ్లీ ఉగ్రవాద శిబిరం వెలసిందన్న భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ వ్యాఖ్యలను పాకిస్థాన్​ ఖండించింది. ఇది పూర్తిగా నిరాధార ఆరోపణ అని పేర్కొంది. జమ్ము కశ్మీర్​ సంక్షోభం నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు భారత్ ఇలా​ ప్రయత్నిస్తోందని ప్రత్యారోపణలు చేసింది.

'బాలాకోట్​'పై రావత్​ వ్యాఖ్యలు నిరాధారం: పాక్​

By

Published : Sep 24, 2019, 3:04 PM IST

Updated : Oct 1, 2019, 7:58 PM IST

'బాలాకోట్​'పై రావత్​ వ్యాఖ్యలు నిరాధారం: పాక్​

భారత్​కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాక్​.. మరోమారు తన బుకాయింపు వైఖరి ప్రదర్శించింది. బాలాకోట్​ ఉగ్రవాద శిబిరం పునరుద్ధరణపై బిపిన్​ రావత్ వ్యాఖ్యలను పాక్ విదేశాంగ శాఖ ఖండించింది. భారత సైన్యాధ్యక్షుడి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది.

బిపిన్​ రావత్​ సోమవారం చెన్నైలో... 'పాకిస్థాన్​ ఇటీవలే బాలాకోట్ ఉగ్రవాద శిబిరాన్ని పునరుద్ధరించింది. సుమారు 500 మంది ఉగ్రవాదులు భారత్​లోకి చొరబాడడానికి సిద్ధంగా ఉన్నారు' అని వ్యాఖ్యానించారు. పాక్ దుశ్చర్యలకు ఈసారి భారత్​ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

బిపిన్ రావత్ వ్యాఖ్యలు ఖండించిన పాక్... జమ్ము కశ్మీర్​లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు భారత్​ ప్రయత్నిస్తోందని ప్రత్యారోపణలు చేసింది. అయితే ఈ ప్రయత్నాలు సఫలం కాబోవని వ్యాఖ్యానించింది.

జైషే దాడికి ప్రతీకారం

జమ్ము కశ్మీర్​ పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవానులు అమరులయ్యారు. ప్రతీకారంగా భారత వాయుసేన... పాకిస్థాన్​లోని బాలాకోట్​లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది.

ఇదీ చూడండి:'సోషల్ మీడియా నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలు'

Last Updated : Oct 1, 2019, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details