భారత్పైమరోసారి అక్కసు వెళ్లగక్కింది దాయాదిపాకిస్థాన్. ఉగ్రవాదులుగా భారత్ ఆధారాలు చూపిస్తున్నప్పటకీ... సైన్యం పట్టుకున్న ఉగ్రవాదులను తమ దేశ రైతులుగా పేర్కొంది పాకిస్థాన్. అంతటితో ఆగకుండా... రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తోంది.
భారత్‌లో అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులను భారత సైన్యం ఇటీవలే అదుపులోకి తీసుకుంది. వారు రైతులని పాక్ వాదిస్తోంది. అనుకోకుండా నియంత్రణ రేఖ దాటారని వివరణ ఇస్తోంది. కానీ తాము లష్కరే తోయిబాకు చెందిన వారిమని ఆ ఉగ్రవాదులు ఇప్పటికే అంగీకరించారు.