తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత సైన్యాధ్యక్షుడి వ్యాఖ్యలు బాధ్యతా రహితం: పాక్​ - భారత సైన్యాధ్యక్షుడి వ్యాఖ్యలు బాధ్యతా రహితం: పాక్​

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ఆపకపోతే ముందస్తు దాడులకు దిగేందుకు వెనుకాడబోమన్న భారత సైన్యాధ్యక్షుడు ముకుంద్ నరవాణే వ్యాఖ్యలకు ఖండించింది పాకిస్థాన్. భారత్​ నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటామని వెల్లడించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

pak
భారత సైన్యాధ్యక్షుడి వ్యాఖ్యలు బాధ్యతా రహితం: పాక్​

By

Published : Jan 2, 2020, 5:16 AM IST

భారత సైన్యాధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్​పై విరుచుకుపడ్డారు ముకుంద్​ నరవాణే. పాక్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ఆపకపోతే ముందస్తు దాడి చేసేందుకు తమకు హక్కు ఉందని హెచ్చరించారు. తాజాగా ఈ వ్యాఖ్యలను పాకిస్థాన్​ తోసిపుచ్చింది. నరవాణే మాటలు బాధ్యతా రహితంగా ఉన్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది.

"భారత నూతన సైన్యాధ్యక్షుడి ప్రకటనను మేం వ్యతిరేకిస్తున్నాం. నియంత్రణ రేఖ వెంబడి ముందస్తు దాడులు చేపట్టేందుకు భారత్​కు హక్కు ఉందన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. భారత్​ నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం. బాలాకోట్ ఘటన​ అనంతరం పాక్​ ప్రతిఘటించిన తీరును ప్రపంచం మరచిపోదు."

-పాక్ విదేశాంగ శాఖ ప్రకటన.

భారత్​ రెచ్చగొడుతున్నప్పటికీ... శాంతి-భద్రతలను ప్రోత్సహించడానికి తమ దేశం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పాక్​ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ఎలాంటి సవాలుకైనా సై: సైన్యాధిపతి నరవాణే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details