తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​ ప్రధానితో భారత సైన్యాధిపతి భేటీ

మూడు రోజుల నేపాల్​ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలితో శుక్రవారం భేటీ అయ్యారు భారత సైన్యాధిపతి జనరల్​ ఎంఎం నరవాణే. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

Indian Army chief Gen Naravane
నేపాల్​ ప్రధాని ఓలీతో భారత సైన్యాధిపతి భేటీ

By

Published : Nov 6, 2020, 3:25 PM IST

నేపాల్​ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలితో సమావేశమయ్యారు భారత సైన్యాధిపతి జనరల్​ ఎంఎం నరవాణే. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలిపాయి పొరుగుదేశ సైనికవర్గాలు. కాఠ్​మాండూలోని ప్రధాని ఓలి అధికారిక నివాసంలో ఇరువురు భేటీ అయినట్లు వెల్లడించాయి.

అంతకు ముందు ఎవరెస్ట్​ శిఖర ప్రవేశ ద్వారమైన సియాంగ్బోచే విమానాశ్రయంలో కొద్ది సేపు గడిపారు నరవాణే. అనంతరం విమానంలో పర్వత శ్రేణుల్లో చక్కర్లు కొట్టారు. అలాగే కాఠ్​మాండూ శివపురిలోని ఆర్మీ కమాండ్​ అండ్​ స్టాఫ్​ కళాశాలలో శిక్షణలో ఉన్న అధికారులతో భేటీ అయ్యారు నరవాణే. తన అనుభవాలను వారితో పంచుకున్నారు.

మూడు రోజుల నేపాల్ పర్యటనలో భాగంగా ఇప్పటికే ఆ దేశ సైన్యాధిపతి పూర్ణచంద్ర థాప సహా కీలక నేతలు, అధికారులతో భేటీ అయ్యారు నరవాణే.

సరిహద్దు వివాదంతో భారత్​-నేపాల్​ మధ్య మైత్రి ఇటీవలే బలహీనపడింది. ఈ నేపథ్యంలో భారత సైన్యాధిపతి నేపాల్​ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: నేపాల్​ ఆర్మీ చీఫ్​తో నరవాణే కీలక చర్చ

'నేపాల్ ఆర్మీ జనరల్​'గా నరవాణే!

ABOUT THE AUTHOR

...view details