భారత్‌తో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్థాన్ పలు కీలక వ్యాఖ్యలు చేస్తోంది. పాక్ చెరలో ఉన్న భారత నావికా దళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను దౌత్యపరంగా కలుసుకోవడానికి భారత్‌కు రెండోసారి అవకాశం ఇవ్వబోమని తాజాగా పేర్కొంది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ ప్రకటన చేశారు.
దౌత్యపరంగా జాదవ్‌ను కలుసుకునే అవకాశం ఇవ్వాలని అంతర్జాతీయ న్యాయస్థానం గతంలో పాక్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 2న పాక్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియా జాదవ్‌ను కలుసుకున్నారు.