గతేడాది ఫిబ్రవరిలో భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ నిర్బంధించింది. ఆ సమయంలో పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా.. తీవ్ర భయాందోళనకు గురయ్యారని పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్(పీఎమ్ఎల్-ఎన్)నేత అయాజ్ సాదిఖ్ అన్నారు.
అభినందన్‌ను వదిలిపెట్టకపోతే.. భారత్ తమ దేశంపై దాడి చేస్తుందని బాజ్వా వణికిపోయారని చెప్పారు. ఆ దేశ పార్లమెంట్ సమావేశంలో అయాజ్ సాదిఖ్ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.
"ఆరోజు జరిగిన సమావేశం నాకు బాగా గుర్తుంది. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి.. పార్లమెంటరీ నేతలతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. అభినందన్‌ను గనుక విడిచిపెట్టకపోతే.. రాత్రి 9 గంటలకల్లా పాకిస్థాన్‌పై భారత్ దాడి చేస్తుందని ఖురేషి హెచ్చరించారు. ఆ సమయంలో ఆర్మీ ఛీఫ్ బాజ్వా కాళ్లు వణకడం నేను గమనించాను. "