భారత్- అమెరికా ద్వైపాక్షిక పౌర అణు ఒప్పందంలో మరో ముందడుగు పడింది. ఇరుదేశాల మధ్య తాజాగా ద్వైపాక్షిక పౌర అణు ఇంధన సహకార ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా అమెరికా ఆరు అణు విద్యుత్ ప్లాంట్లను భారత్లో నిర్మిస్తుంది.
భారత్-అమెరికాల మధ్య తాజాగా 9వ రౌండ్ వ్యూహాత్మక భద్రతా చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా ఇరుదేశాలు 'ద్వైపాక్షిక పౌర అణు ఇంధన సహకార ఒప్పందం'పై ఉమ్మడి ప్రకటన చేశాయి. ఈ ద్వైపాక్షిక చర్చల్లో భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖలే, అమెరికా ఆయుధ నియంత్రణ, అంతర్జాతీయ భద్రతా కార్యదర్శి ఆండియా థాంప్సన్ పాల్గొన్నారు.
"భారత్లో 6 అణు విద్యుత్ కేంద్రాలను అమెరికా ఏర్పాటు చేస్తుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక భద్రత, పౌర అణు సహకారాన్ని బలోపేతం చేసేందుకు మేము కట్టిబడి ఉన్నాం."- భారత్-అమెరికా సంయుక్త ప్రకటన
చారిత్రక ఒప్పందం...