జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ చుట్టు ఉచ్చు బిగించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ విషయమై తాజాగా యూఎన్ భద్రతా మండలిలోని చైనాతో పాటు మరో 14 దేశాలను భారత్ సంప్రదిస్తోంది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనకు మద్దతివ్వాలని అభ్యర్థిస్తోంది.
పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ అధినేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఇటీవలే భద్రతా మండలికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ప్రతిపాదించాయి.