తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా'పై పోరాటానికి చైనాకు అండగా భారత్​ - కరోనాపై పోరాటానికి చైనాకు అండగా భారత్​

కొద్దిరోజులుగా ప్రాణాంతక కరోనా వైరస్​తో పోరాడుతోంది చైనా. కఠిన చర్యలు తీసుకుంటూ, ఎన్నో ఆంక్షలు విధించినప్పటికీ వ్యాధి వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. అయితే.. కరోనాపై పోరాటానికి చైనాకు సాయమందించేందుకు ముందుకొచ్చింది భారత్​. ఈ వారాంతంలో వైద్య సామగ్రిని పంపిస్తున్నట్లు తెలిపింది.

India to send consignment of medical supplies to China
కరోనాపై పోరాటానికి చైనాకు అండగా భారత్​

By

Published : Feb 17, 2020, 6:26 PM IST

Updated : Mar 1, 2020, 3:28 PM IST

చైనాను కలవరపెడుతూ... రోజుకు వందలకొద్దీ ప్రాణాలను బలిగొంటున్న కొవిడ్​-19 (కరోనా) మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనాకు సాయమందించనుంది భారత్. ఇందులో భాగంగా మాస్క్​లు, చేతి గ్లౌజులు మొదలైన వైద్య సామగ్రిని చైనాకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

వుహాన్​ ప్రాంతంలోనే అధికంగా...

చైనా-హుబే రాష్ట్రంలోని వుహాన్​లో కరోనా తాకిడి అధికంగా ఉంది. ఈ ప్రాంతానికి వారం చివర్లోగా వైద్య సామగ్రిని సహాయక విమానం ద్వారా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఆ ఫ్లైట్​లోనే చైనాలో ఉన్న భారతీయులను పరిమిత సంఖ్యలో తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

కరోనా తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఈ మహమ్మారి దాడికి 1,770 మందికిపైగా మృతి చెందగా.. మరో 70,548 మంది వ్యాధి బారినపడ్డారు.

ఇదీ చదవండి:డ్రైవర్​కు కారు గిఫ్ట్​గా ఇచ్చిన యజమాని

Last Updated : Mar 1, 2020, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details