నేపాల్లోని విద్యాసంస్థల పునర్నిర్మాణం కోసం భారీ సాయం ప్రకటించింది భారత్. 2015లో భూకంపం దాటికి ధ్వంసమైన 8 జిల్లాల్లోని 71 విద్యాసంస్థలను పునర్నిర్మించేందుకు 50 మిలియన్ అమెరికా డాలర్లు (సుమారు 5800 మిలియన్ల నేపాల్ రూపాయలు) అందించనుంది. ఇప్పటికే 70 పాఠశాలల నిర్మాణం ప్రారంభమైంది. అందులో ఎనిమిదింటిని పాఠశాల నిర్వహణ కమిటీకి అప్పగించినట్లు నేపాల్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
రోషి రూరల్ మున్సిపాలిటి పరిధిలోని హరిసిద్ధి ఉన్నత పాఠశాల, మహాభారత్ రూరల్ మున్సిపాలిటిలోని సిద్ధేశ్వర్ ఉన్నత పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది. హరిసిద్ధి పాఠశాల పునర్నిర్మాణానికి 28.4 మిలియన్ల నేపాల్ రూపాయాలు, సిద్ధేశ్వర్ పాఠశాలకు 39.6 మిలియన్ల నేపాల్ రూపాయలు ఖర్చు చేస్తున్నారు.