పాకిస్థాన్‌తో ద్వైపాకిక్ష సంబంధాలు ఇంకా మెరుగుపరుచుకుంటామని రష్యా తెలిపింది. షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ)లో పాక్ సభ్య దేశమైనందునే సత్సంబంధాలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ విషయంపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రష్యన్ మిషన్ డిప్యూటీ చీఫ్ రోమన్ బబుష్కిన్ తెలిపారు. పాక్-రష్యా మధ్య సంబంధాలు స్వతంత్ర అంశమని, ఇతర దేశాల సున్నితత్వాన్ని తాము గౌరవిస్తామని చెప్పారు.
ఏ దేశానికీ వ్యతిరేకం కాకుండా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించడం రష్యా విదేశీ విధాన ప్రాథమిక సూత్రమని రోమన్ స్పష్టం చేశారు.
ఏకపక్ష ఆంక్షలు పట్టించుకోం..
ఎస్-400 క్షిపణి వ్యవస్థ సరఫరా సహా భారత్‌తో రక్షణ ఒప్పందాలు కొనసాగుతాయని రష్యా తేల్చి చెప్పింది. తమ దేశంతో రక్షణ ఒప్పందాలు చేసుకున్న ఇతర దేశాలపై అమెరికా ఏకపక్షంగా విధిస్తున్న ఆంక్షలను తాము పట్టించుకోబమని స్పష్టం చేసింది. ఐరాస భద్రతా మండలి నిబంధనలే తమకు ముఖ్యమని పేర్కొంది.
రష్యాతో 2.5 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నందుకు టర్కీపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ విషయంపైనే రష్యా రాయబారి నికోలయ కుదాషేవ్ స్పందించారు. అమెరికా ఆంక్షలపై భారత్, రష్యాకు స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'అమెరికా వైఖరి మార్చుకోవాలి'