తెలంగాణ

telangana

ETV Bharat / international

సౌదీతో భారత్​ బంధం మరింత దృఢం: మోదీ

అమ్మకం-కొనుగోలుదారుస్థాయి నుంచి సన్నిహిత భాగస్వామ్యస్థాయి దిశగా వెళ్లేందుకు భారత్​-సౌదీ అడుగులేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. భారత్​లోని చమురు, గ్యాస్​ ప్రాజెక్టుల్లో సౌదీకి చెందిన ఆరాంకో పెట్టుబడులు కూడా ఈ సంబంధాల్లో భాగమేనని వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కారం దిశగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

సౌదీతో భారత్​ బంధం మరింత దృఢం: మోదీ

By

Published : Oct 29, 2019, 1:17 PM IST

సౌదీ అరేబియాలో 2 రోజుల పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత్​-సౌదీ మధ్య సత్సంబంధాలు మరింత మెరుగయ్యే దిశగా వెళ్తున్నాయని తెలిపారు. అమ్మకం-కొనుగోలుదారుస్థాయి నుంచి సన్నిహిత భాగస్వామ్యస్థాయికి వెళ్లేందుకు ఇరుదేశాలు అడుగులేస్తున్నట్లు 'అరబ్​ న్యూస్'​ పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో పేర్కొన్నారు. భారత్​లోని చమురు, గ్యాస్​ ప్రాజెక్టుల్లో సౌదీ పెట్టుబడులు కూడా ఈ సంబంధాల్లో భాగమేనని వ్యాఖ్యానించారు.

" ప్రపంచ అభివృద్ధికి స్థిరమైన చమురు ధరలు కీలకం. భారతదేశ చమురు అవసరాలు తీర్చడంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషిస్తోంది. భారత్​ పశ్చిమ తీరంలో సౌదీకి చెందిన అరాంకో సంస్థ పెట్రోలియం ప్రాజెక్టులను చేపట్టింది. భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో కూడా ఆ సంస్ధ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాను."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

రెండో అతిపెద్ద దేశం

'ఇరాక్​ తర్వాత భారత్​కు ముడిచమురు సరఫరా చేస్తున్న రెండో అతిపెద్ద దేశం సౌదీ అరేబియా' అని ప్రధాని పేర్కొన్నారు. భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడిచమురులో 18 శాతం వరకు సౌదీ నుంచి వస్తున్నదేనన్న ఆయన.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ 207.3 మిలియన్​ టన్నుల ముడిచమురు దిగుమతి చేసుకోగా అందులో 40.33 మిలియన్​ టన్నులు సౌదీనే ఎగుమతి చేసిందని స్పష్టం చేశారు.

రెండు రోజుల పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ ఈ తెల్లవారుజామున సౌదీ అరేబియాకు చేరుకున్నారు. రెండు రోజులపాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్న మోదీ.. ఉన్నత స్థాయి వార్షిక ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం గల్ఫ్‌ రాజ్యాల దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

ABOUT THE AUTHOR

...view details