తెలంగాణ

telangana

ETV Bharat / international

'మోదీ విమానాన్ని అనుమతించండి' - Narendra Modi

కిర్గిస్థాన్‌లో ఈ నెల 13, 14 తేదీల్లో షాంఘై సహకార సంఘం సమావేశం జరగనుంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విమానాన్ని పాకిస్థాన్‌ గగనతలం మీదుగా అనుమతించాలని ఆ దేశానికి విజ్ఞప్తి చేశారు భారత అధికారులు.

'పాకిస్థాన్​ మీదుగా మోదీ విమానాన్ని అనుమతించండి'

By

Published : Jun 10, 2019, 5:45 AM IST

Updated : Jun 10, 2019, 10:16 AM IST

'పాక్​​ మీదుగా మోదీ విమానాన్ని అనుమతించండి'

భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానాన్ని పాకిస్థాన్‌ గగనతలం మీదుగా అనుమతించాలని ఆ దేశ అధికారులను​ కోరింది భారత్​. షాంఘై సహకార సంఘం సమావేశానికై మోదీ కిర్గిస్థాన్​ వెళ్లాల్సి ఉంది.

" పాకిస్థాన్‌​ మూసివేసిన ఓ వాయుమార్గం ద్వారా ప్రధాని మోదీ విమానాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశాం. కిర్గిస్థాన్​ రాజధాని బిష్కెక్​లో ఈ నెల​ 13,14 తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సంఘం సదస్సులో ప్రధాని పాల్గొనాల్సివుంది."
- కేంద్ర ప్రభుత్వ అధికారి

వైమానిక దాడుల అనంతరం మూసివేత

బాలాకోట్‌ ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ తమ దేశ దక్షిణ ప్రాంతంలో ఉన్న రెండు గగనతల మార్గాలు మినహా మిగతా 11 మార్గాలను మూసివేసింది. అయితే.. మే 21న షాంఘై సహకార సంఘం విదేశాంగ మంత్రుల సమావేశంలో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ పాల్గొన్నారు.

సుష్మా స్వరాజ్​ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి జారీ చేసింది పాకిస్థాన్​. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ప్రయాణానికి వీలుగా తాజాగా విజ్ఞప్తి చేశారు అధికారులు.

ఇదీ చూడండి : 'కిశోర్​ వ్యవహారంతో మాకు సంబంధం లేదు'

Last Updated : Jun 10, 2019, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details