బాస్మతి బియ్యంపై ప్రత్యేక ట్రేడ్‌మార్క్ హక్కుల కోసం ఐరోపా సమాఖ్యకు దరఖాస్తు చేసింది భారత్. ఈ మేరకు రక్షణాత్మక భౌగోళిక గుర్తింపు కోసం విజ్ఞప్తి చేసింది. అయితే భారత్ దరఖాస్తుపై పాకిస్థాన్ గగ్గోలు పెడుతోంది.
ప్రపంచంలోనే అత్యధికంగా బియ్యం ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండగా, పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలకు భారత్, పాకిస్థాన్ మాత్రమే బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఐరోపా క్రిమిసంహారక ప్రమాణాల విషయంలో భారత్ ఇబ్బందులను అందిపుచ్చుకున్న పాకిస్థాన్.. గత మూడు సంవత్సరాల్లో ఐరోపా సమాఖ్య దేశాలకు బియ్యం ఎగుమతులను విస్తరించింది.