తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీర్​ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి: పాక్​ - ఉగ్ర దాడి

భారత్​-పాక్​ సంబంధాలు క్షీణించిన వేళ.. ఆ దేశ ఆర్మీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్​ సమస్యను ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అన్నారు జనరల్​ ఖమర్​ జావేద్​ బజ్వా. పాకిస్థాన్​.. శాంతి దేశమని, ప్రపంచ శాంతి కోసం గొప్ప త్యాగాలు చేసిందని చెప్పుకొచ్చారు.

India, Pakistan must resolve Kashmir issue peacefully: Gen Bajwa
కశ్మీర్​ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి

By

Published : Feb 3, 2021, 6:12 AM IST

సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కశ్మీర్​ సమస్యను భారత్​, పాక్​ శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అన్నారు ఆ దేశ​ సైన్యాధిపతి జనరల్​ ఖమర్​ జావేద్​ బజ్వా. సుదీర్ఘ సమస్యకు ముగింపు పలకాలని కోరారు.

ఖైబర్​ పఖ్తుంక్వాలోని అస్ఘర్​ ఖాన్​ అకాడమీలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు బజ్వా.

''సుదీర్ఘ కాలంగా ఉన్న జమ్ముకశ్మీర్​ సమస్యను భారత్​-పాక్​ గౌరవప్రదంగా, శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇది జమ్ముకశ్మీర్​ ప్రజల ఆకాంక్ష.''

- జనరల్​ ఖమర్​ జావేద్​ బజ్వా, పాక్​ ఆర్మీ చీఫ్​

పాకిస్థాన్​ శాంతిని, ప్రేమను పంచే దేశమని, ప్రపంచ శాంతి కోసం ఎన్నో త్యాగాలు చేసిందని గొప్పలకు పోయారు బజ్వా.

ఇదీ చూడండి:'సీపెక్'​ రక్షణ పేరుతో పాక్​-చైనా కుట్రలు!

పాకిస్థాన్​ సైన్యానికి ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని అన్నారు.

పుల్వామా దాడి అనంతర పరిస్థితుల నుంచి దాయాది దేశంతో సంబంధాలను తగ్గించుకుంది భారత్​. చర్చలు, ఉగ్రవాదం ఒకే చోట ఉండవని పలు మార్లు నొక్కిచెప్పింది. పాక్​ భూభాగం నుంచి భారత్​లో దాడులు చేసే ఉగ్రముఠాలపై చర్యలు తీసుకోవాలని ఆ దేశాన్ని హెచ్చరించింది.

ఇదీ చూడండి: పాక్ ఉగ్ర చొరబాట్లకు చైనా 'డ్రోన్ సాయం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details