పాకిస్థాన్‌తో మిడతల సమస్యపై చర్చించేందుకు జూన్ 18న టెక్నికల్ లెవల్ సమావేశం జరపాలని భారత్ ప్రతిపాదించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
"మిడతల సమస్య నివారణ కోసం ఓ సాంకేతిక స్థాయి సమావేశం నిర్వహించాలని పాకిస్థాన్‌కు ప్రతిపాదించాం. అలాగే ఉమ్మడిగా మిడతల నియంత్రణ కార్యకలాపాలు చేపట్టాలని, పురుగుల మందు సరఫరా సులభతరం చేయగలమని ప్రతిపాదన చేశాం. అయితే పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ జూన్ 18న ఇరుదేశాల మధ్య టెక్నికల్ లెవల్ సమావేశం జరిగే అవకాశముంది."
- అనురాగ్ శ్రీవాత్సవ, భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి
ఇరాన్‌కు సాయం
మిడతలను నియంత్రించే విషయంలో, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు భారత్ కృషి చేస్తోందని అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్... 20,000 లీటర్ల పురుగుల మందును ఇరాన్‌కు పంపించినట్లు స్పష్టం చేశారు. ఈ పురుగుల మందు జూన్ 15 నాటికి ఇరాన్‌లోని చాబహార్ నౌకాశ్రయాన్ని చేరుకుంటుందని ఆయన వెల్లడించారు.