తెలంగాణ

telangana

ETV Bharat / international

కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ చర్చలు

కర్తార్​పుర్​ నడవాపై భారత్​, పాకిస్థాన్​ మధ్య సమావేశం జరిగింది. ఇరుదేశాలకు చెందిన 15 మంది ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. భారత్​, పాక్​ కలిసే కర్తార్​పుర్​ నడవా జీరోపాయింట్​ వద్ద ఈ చర్చలు జరిపారు.

కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ చర్చలుకర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ చర్చలు

By

Published : Aug 30, 2019, 1:51 PM IST

Updated : Sep 28, 2019, 8:46 PM IST

కర్తార్​పుర్​ నడవా సాంకేతిక అంశాలపై భారత్​-పాకిస్థాన్​ అధికారులు సమావేశం నిర్వహించారు. జమ్ముకశ్మీర్​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల అనంతరం కర్తార్​పుర్​ జీరోపాయింట్​ వద్ద మొదటి సారి చర్చలు జరిపారు. భారత్,​ పాకిస్థాన్​కు​ చెందిన 15 మంది ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భారత్​ పంజాబ్​లోని సిక్కు పవిత్ర క్షేత్రం 'డేరా బాబా నానక్​ సాహెబ్'​, అలాగే పాకిస్థాన్​ పంజాబ్​లోని 'గురుద్వారా దర్బార్​ సాహిబ్​ కర్తార్​పుర్​' లను ఈ నడవా కలుపుతుంది. ఫలితంగా ఇరుదేశాల సిక్కు భక్తులు తమ పవిత్ర క్షేత్రాలను వీసా లేకుండా దర్శించడానికి మార్గం సుగమమవుతుంది. శ్రమ తగ్గుతుంది.

గతంలోనూ చర్చలు

కర్తార్​పుర్​ నడవాకు సంబంధించి కొన్ని నెలలుగా ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతూ వచ్చాయి. ఈ సమావేశాల్లో ఇరుపక్షాల నిపుణులు అనేక అంశాలపై చర్చించారు.

జులైలోనూ ఈ విషయంపై చర్చించేందుకు ఇరుదేశాల ప్రతినిధులు పాకిస్థాన్​లోని అత్తారీ-వాఘా సరిహద్దులో సమావేశం నిర్వహించారు.

మొదటి వీసా రహిత ప్రయాణం?

ఒకవైపు పాకిస్థాన్​ భారత సరిహద్దు నుంచి దర్బార్​ సాహిబ్​ వరకు నడవా నిర్మిస్తుండగా, మరోవైపు భారత్ బాబానానక్​ నుంచి నడవాను నిర్మిస్తోంది. ఒక వేళ ఈ చర్చలు ఫలించినట్లయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య మొదటి సారి వీసా రహిత ప్రయాణం అమలు చేసినట్లవుతుంది.

ఇదీ చూడండి:అసోం ఎన్​ఆర్​సీ తుది జాబితాపై ఆందోళనలు

Last Updated : Sep 28, 2019, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details