భారత్, నేపాల్ మధ్య విభేదాలను తగ్గించేందుకు రెండు దేశాలు ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆగస్టు 17న రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించనున్నట్లు కాఠ్మాండూ పోస్ట్ నివేదించింది.
రెండు దేశాల ప్రాదేశిక యంత్రాంగాల మధ్య జరగనున్న 8వ సమావేశం ఇది. సరిహద్దు వివాదాన్ని తగ్గించేందుకు రెండు దేశాల మధ్య మొదటి దశ చర్చలుగా వీటిని అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు.
వివాదాలు ఇవీ..
భారత సరిహద్దుల్లోని కీలకమైన ప్రాంతాలను తమ భూభాగంలో చూపిస్తూ జాతీయ పటాన్ని విడుదల చేసి వివాదానికి తెరతీసింది నేపాల్. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర తమవేనని వాదిస్తోంది. అయితే నేపాల్ చేసిన ప్రాదేశిక మార్పులను 'కృత్రిమ విస్తరణ'గా ఆరోపించింది భారత్.
ఉత్తరాఖండ్‌లో ధార్చులా నుంచి లిపులేఖ్‌కు కలిపే రోడ్డును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించటంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ భూభాగం గుండా రోడ్డు నిర్మించారని ఆరోపించింది. ఈ ఆరోపణలను ఖండించిన భారత్.. రహదారి పూర్తిగా భారత్ భూభాగంలోనే ఉందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:భారత్‌పై నేపాల్‌కు ఎందుకంత అక్కసు?